Friday, January 9, 2009

చికెన్ ఫ్రై

 చికెన్ ఫ్రై కావలసిన పదార్దాలు:
నూనె                      :     పావుకేజీ
చికెన్                       :     1కేజీ 
ఉల్లిపాయలూ           :     4
పఛిమిరపకాయలు   :     4
మసాలా                   :     అల్లం, వెల్లుల్లి పేస్టు 5 టీ స్పూన్స్ (కావాలంటే కొబ్బరి చిన్న చిప్ప పేస్టు చేసి వేసుకోవచ్చు)     
ఉప్పు                      :       తగినంత 
కారం                       :        2 టీ స్పూన్స్ 
కొత్తిమీర                   :        కొంచెం 
కరీవేపాకు                 :        కొంచెం 
తయారీ విదానము:
ముందుగ చికెన్ చిన్న ముక్కలుగా చేసి ఒక  గిన్నెలోకి తీసుకొని బాగా నీటితో కడగాలి. తరువాత కొద్దిగా మంచినీటిని పోసి మరొకసారి వాష్ చేసుకొని నీరు అంటే వంచేసి ఇప్పుడు అందులో కొంచెం పసుపు, ఉప్పు,కారం , అల్లం వెల్లుల్లిముద్ద అన్ని వేసి 15 నిమషాలు పక్కనపెట్టుకోవాలి. ఇప్పడు స్టవ్ వెలిగించి దాని మీద కడాయి పెట్టుకొని అందులో తగినంత నూనె వేసి నూనె వేడెక్కిన తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వేసి కొంచెం దోరగా  వేగిన తరువాత ఇప్పడు జీడిపప్పు వేసుకొని కొంచెం వేగిన తరువాత ఇప్పడు చికెన్ ను వేసి బాగా కలియబెట్టాలి. 20 నిమిషాలు తరువాత  కొత్తిమీరని , కరివేపాకుని వేసి మరొకసారి బాగా కలియ బెట్టాలి ఇప్పుడు ధనియాల పొడి వేసి  స్టవ్ ఆఫ్ చేసి . ఇప్పుడు సెర్వింగ్ బోవేల్ లోకి తీసుకొని సర్వ్  చేసుకోవచ్చు. 
వేడి వేడి  చికెన్ ఫ్రై తినటానికి రెడీ.....