Tuesday, May 31, 2011

కొబ్బరి బూరెలు

కొబ్బరి బూరెలు తయారీఉ చేయటం ఎలా?
కావలసిన పదార్దాలు :
పచ్చి కొబ్బరి ----------- పావుకేజీ,
బియ్యం పిండి ----------- పావుకేజీ, బెల్లం ----------- అరకేజీ,
యాలుకలు ------------ అయిదు,
నూనె ------------ ఫ్రయి చేసుకోవటానికి తగినంత,

తయారీ విదానము:
ముందుగ బియ్యం పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అందులో బెల్లం నలగ కొట్టి కలుపుకోవాలి కొంచెం నీరు పోసి కొంచెం జావగా కాకుండా మరి గట్టిగ కాకుండా మధ్యస్తంగా కలుపుకోవాలి .కలుపుకున్న మిశ్రమాన్ని ఒక పదిహేను నిమిషాల పాటు నానాపెట్టుకోవాలి.....
ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి నూనె పోసి బాగా కాగిన తరువాత కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న వడలు ఆకారంలో చేసుకొని నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు వుంచి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.....
అంతే రుచికరమయిన వేడి వేడి కొబ్బరి బూరెలు తయార్......