Thursday, August 18, 2011

గుత్తి వంకాయ కూర

గుత్తి వంకాయ కూర ఎలా చెయ్యాలో చూద్దామ  మరి :
కావలసిన పదార్దాలు:
వంకాయలు (పచ్చవి): హాఫ్ కేజీ
ఉల్లిపాయలు: మూడు
పచ్చి మిర్చి: అయిదు
టమాటాలు: రెండు
చింత పండు రసం అయిదు నుంచి ఆరు స్పూన్స్
పల్లీలు(వేరు శనగ పప్పు): ఒక చిన్న కప్పు
దనియాలు: హాఫ్ కప్పు
జీల కర్ర: మూడు టీ స్పూన్స్
ఎండు మిరపకాయలు: అయిదు నుంచి ఆరు

ఉప్పు: రుచికి తగినంత
పసుపు : చిటికెడు

కొత్తిమీర, పుడున, కరివేపాకు. కొంచెం
తాలిం పు కి ( ఆవాలుa, పచ్చి శనగ పప్పు, మినపప్పు,): అన్ని కలిపి ఒక టీ స్పూన్ తీసుకోవాలి.

తయారీ విదానము:

ముందుగా కడాయి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో మూడు స్పూన్స్ ఆయిల్ వేసుకొని నూనె వేడి ఎక్కిన్ తరువాత ఎండుమిరపకాయలు, దనియాలు, జీలకర్ర వేసి దోరగా వేయించుకొని ఒక స్పూన్ ఉప్పు వేసి ఒక బోవేల్ లోకి తీసుకోవాలి. అలా వేయించు పెట్టుకున్న వాటిని గ్రయిండ్ చేసి పెట్టుకోవాలి.

ఇప్పుడు చింత పండు ని కూడా ఒక గ్లాస్ వాటర్ లో నానపెట్టుకోవాలి.

వంకాయలని బాగా కడిగి వాటిని నలుగు పక్షాలుగా సగం varఆకూ కట్ చేసి అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి ని వంకాయ్ లోకి రెండు నుంచి మూడు టీ స్పూన్స్ పొడి ని అలా అన్ని వంకాయల లోకి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీదా కడాయి పెట్టికొని ఒక చిన్న కప్పు ఆయిల్ వేసుకొని కొంచెం వేడి ఎక్కిన్ తరువాత తాలింపు గిం జెలు వేసుకొని , పచ్చి మిర్చి , కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచిన్ తరువాత అందులో వంకాయలను కూడా వేసి ఒక అయిదు నిమిషాలు వుంచి అందులో చింత పండు పులుసు వేసి అందులో తగినన్ని నీళ్ళు పోసి అంటే వంకాయలు మునిగే వరకు నీళ్ళు పోసుకోవచ్చు అందులో పసుపు చిటికెడు, కారం మూడు టీ స్పూన్స్ , ఉప్పు రుచి తగినంత , దనియాల పొడి, జీలకర్ర పొడి రెండు టీ స్పూన్స్ వేసి కూర దగ్గర పడేవరకు వుంచి ఇప్పుడు కొత్తిమీర , పుదినా , కరివేపాకు వేసి మఅరి కొద్ది సేపు వుంచి సెర్వింగ్ బోవేల్ లో కి తీసుకుంటే వేడి వేడిగుమ గుమ లాడే గుత్తి వంకాయ్ కూర తినటానికి రెడీ.













సోరకాయ్ హల్వా

 సోరకాయ్ హల్వా తయార్ చేయటం

కావలసిన పదార్దాలు:

సోరకాయ్: హాఫ్ కేజీ,
బెల్లం: హాఫ్ కేజీ,
కిస్స్మిస్స్, జీడి పప్పు , పిస్తా , బాదం
యాలుకలు: అయిదు నుంచి ఆరు

తయారీ విదానము: 

ముందుగా సోరకాయ్ ని తురుముకోవాలి లేదా గ్రయిండ్ చేసుకొని ఒక బోవేల్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి కొంచెం నెయ్యి వేడి ఎక్కిన్ తరువాత సోరకాయ్ తురుముని వేసి పచ్చి వాసన పోయే వరకు ఒక అయిదు నిమిషాలు వేయించాలి తరువాత ఒక బోవేల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.

అలాగే కడాయి లో ఇంకొక స్పూన్ నెయ్యి వేసి జీడి పప్పు, కిస్స్మిస్స్, గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా వేయించి పక్కన ఒక బోవేల్ లో కి తెసి పక్కన పెట్టుకోవాలి .

ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి పొడి చేసి పెట్టుకున్న బెల్లం వేసి తీగ పాకం వచ్చేంత వరకు వుంచి అందులో వేయించి పెట్టుకున్న సోరకాయ్ తురుముని అందులో వేసి బాగా కలపాలి . ఇప్పుడు యాలుకల పొడి, కిస్స్మిస్స్, బాదాం , పిస్తా వేసి బాగా కలపాలి ,

ఒక అయిదు నిముషాలు వుంచి దగ్గర వచెంట వరకు వుంచి మిశ్రమాన్ని వేరే బోవేల్ లోకి తీసుకొని జీడి పప్పు తో గార్నిష్ చేసుకుంటే సొరకాయ్ హల్వా రెడీ .
మీరు ట్రై చేసి చుడండి చాలా బాగుంటుంది .


Tuesday, August 16, 2011

స్వీట్ కార్న్ పాయసం


 స్వీట్ కార్న్ పాయసం ఎలా తయార్ చెయ్యాలో చూద్దామా మరి......
కావలసిన పదార్దాలు:
స్వీట్ కార్న్: ఒక చిన్న కప్పు
షుగర్: ఒక చిన్న కప్పు
యాలుకల పొడి : ఒక టీ స్పూన్
జీడి పప్పు ,కిస్స్మిస్స్, బాదం: గార్నిష్ కి ( ఎవరి కి ఇష్టమయిన ట్టు గ తీసుకోవచ్చు )

తయారి విదానము:
స్వీట్ కార్న్ ని ఉడికించి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడికించి మెత్తగా గ్రైండ్ చేసి
పెట్టుకున్న స్వీట్ కార్న్ ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు షుగర్ ని వేసి బాగా కలుపుకొని కొంచెం దగ్గర పడే వరకు వుంచి అందులో యాలుకల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సెర్వింగ్ బోవేల్ లోకి తీసుకొని జీడి పప్పు, బాదం , కిస్మిమిస్స్ తోటి గార్నిష్ చేసుకోవాల్ .

ఎంతో రుచికరమయిన స్వీట్ కార్న్ పాయసం తయార్.