Tuesday, December 14, 2010

బ్రెడ్ లడ్డులూ తాయారు చేయటం ఎలా?

కావలసిన పదార్దాలు:
బ్రెడ్ --------- చిన్న సైజు బ్రెడ్ ఒకటి,
పంచదార పొడి --------- పావుకేజీ, (తీపి ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు కొంచేము)
నెయ్యి --------- 200 గ్రామస్,
బాదాం, జీడి పప్పు, యాలుకలు, కిస్మిస్స్, తగినన్ని
------------------------------------------------
బ్రెడ్ లడ్డులూ తయారీ విదానము....
ముందుగ బాదం, యాలుకలు, జీడిపప్పు, కిస్మిస్స్ అన్నింటీని కడాయి పొయ్యి మీద పెట్టి అందులో రెండు టీ స్పూన్స్ నెయ్యి వేసి గోల్డెన్ బ్రౌన్ వచేవరకు చిన్న మంటలో వేయించుకోవాలి . తరువాత బ్రెడ్ ని తీసుకొని సైడ్స తీసివేయాలి . తరువాత బ్రెడ్ ని ఒక గిన్నెలోకి తీసుకొని బాగా పొడి చేసుకోవాలి అందులో పంచదార పొడి కలుపుకోవాలి. తరువాత అందులో నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి లడ్డుకు చేయటానికి కావలసిన విదంగా నెయ్యిని వేసుకొని ఇప్పుడు అందులో వేయించి పెట్టుకున్న బాదం, కిస్స్మిస్, యాలుకలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు లడ్డు లాగ వోత్తుకొని ఒక ప్లతే లోకి తెసుకోవాలి అంతే రుచికరమయిన బ్రెడ్ లడ్డులు తయార్...