Friday, August 31, 2012

మామిడి ముక్కల పచ్చడి

మామిడి ముక్కల పచ్చడి కి కావలసినవి:

మామిడి ముక్కలు      :         4 డబ్బాలు 
ఉప్పు                         :         1 డబ్బా 
కారం                          :         1 డబ్బా 
ఆవపిండి                     :         1/4 డబ్బా 
వేరుశనగ నూనె           :           తగినంత  ( అంటే ముక్కలు బాగా మునిగేల నూనె పోసుకుంటే పచ్చడి బాగా రుచిగా ఇంకా నిల్వ కూడా వుంటుంది )

ముందుగ మామిడి కాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక గిన్నెలోకి  తీసుకోవాలి . ఆ ముక్కలలో ఉప్పు, కారం , ఆవ పిండి , మెంతి పిండి  అన్ని ఫైన చెప్పిన ప్రకారం వేసి బాగా  కలపాలి . చివరగా నూనెను వేడి చేసి చల్లార్చి మామిడి ముక్కలలో పోసి బాగా కలపాలి......
రెండో రోజు పచ్చడి ఊరి బాగా రుచిగ వుంటుంది .
 ఈ పచ్చడి నిల్వ వుంటుంది ......





బియ్యప్పిండి హల్వా

బియ్యప్పిండి  హల్వా కి కావలసినవి :

బియ్యప్పిండి              :       పావుకేజీ
పంచదార లేక బెల్లం    :        పావుకేజీ
డాల్డా లేక నెయ్యి        :        పావుకేజీ
జీడి పప్పు                 :         పావుకప్పు

తయారీ విదానము :
ముందుగ  బియ్యం నానబెట్టి మెత్తగా రుబ్బి పాలు తీయాలి .
పాలల్లో పంచదార కలిపి సన్నని సెగ ఫై   పెట్టి కలుపుతూ వుండాలి.
పాలు కొంచెం గట్టిపడగానే, డాల్డా కానీ నెయ్యి కానీ పోసి బాగా కలపాలి మిశ్రమం  బాగా గట్టిపడిన తరువాత  యాలుకల పొడి వేసి మరో సరి బాగా కలిపి ఒక పెద్ద ప్లేట్ లో నెయ్యి రాసి అందులో తయారు చేసి పెట్టుకున్న మిశ్ర మాన్ని అందులో వేయాలి.
నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పును హల్వా ఫై న  అలంకరించుకొని 10 నుంచి 15 నిముషాలు సేపు చల్లారిన తరువాత హల్వా ని మీకు ఇష్ట మైన షేప్స్ లో కట్ చేసుకోవచ్చు.....
  




Thursday, August 30, 2012

స్ట్రా బెర్రీ జామ్

స్ట్రా బెర్రీ జామ్ ఎలాగో చూద్దామా  మ రి ....................
 
స్ట్రా బెర్రీ ---------------- 1 కిలో 
పంచదార ------------- 1 కిలో 

స్ట్రా బెర్రీస్  బాగా కడిగి ముక్కలుగా చేసి ఒక గిన్నెలో వేసి అందులో పంచదార  వేసి   బాగా ఉడక బెట్టాలి.
జామ్ మృదువుగా ఉడికి ఒక మిశ్రమంగా అయిన తరువాత దించేసి పొడిగా వున్నా గాజు సీసాలో పోసుకోవాలి ....

బెండకాయ కొబ్బరి కూర

బెండకాయ కొబ్బరి కూరకు కావలసినవి:
బెండకాయలు         :       పావుకిలో 
పచ్చికొబ్బరి పొడి     :      1 కప్పు 
ఉల్లిపాయలు           :       2 చిన్నవి 
కరివేపాకు               :       2 రెబ్బలు 
కొత్తిమీర                  :        కొంచెం 
 ఉప్పు , కారం          :       తగినంత 
పసుపు                   :       చిటికెడు 
తాలింపు గింజలు     :       3 స్పూన్స్ (ఆవాలు, పచ్చిశనగ పప్పు, జీలకర్ర)
 ఎండు  మిర్చి           :      3
 నూనె                      :      50 గ్రాములు 

తయారీ విదానము :  (బెండకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే పచ్చి కొబ్బరిని ముక్కలుగా చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ).
ముందుగ స్టవ్ వెలిగించి  దానిమీద కడాయి పెట్టుకొని నూనె పోసి కొంచెం వేడి అయిన తరువాత తాలింపు గింజలు 
వేసి అవి బ్రౌన్ కలర్ వచ్చిన తరువాత ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చిన తరువాత బెండకాయలు, పచ్చి కొబ్బరిని వేసి 15 నిమిషాలు వేయించిన తరువాత అందులో ఉప్పు , కారం వేసి బాగా కలపాలి ఇప్పుడు కొత్తిమీర వేసి సెర్వింగ్ బోవేల్ లోకి తీసుకోవాలి.


 

బనానా షేక్

బనానా షేక్ చేయటానికి కావలసిన పదార్దాలు :

అరటిపండు     :   1  
పాలు              :   2
రోజ్ వాటర్       :   కొంచెం 
 పంచదార        :  1 చెంచా 
 ఐస్ క్యుబ్స్      :   2 లేదా 3

తయారుచేయు విదానము:
 ఒక  గిన్నెలో పాలు తీసుకొని అందులో అరటిపండు తొక్కని  తీసి ముక్కలుగా చేసి అందులో వేయాలి.
అందులో పంచదార, రోజ్ వాటర్ కొంచెం వేసి కాసేపు ఫ్రిజ్ లో పెట్టుకొని అతిదులకి అందించే ముందు  జ్యూస్ గ్లాస్ లో ఐస్ క్యుబ్స్ వేసి  తర్వాత  బనానా షేక్ ను పోసి  సర్వే చేయండి .....


ఉల్లిపాయ చట్నీ

ఉల్లిపాయ చట్నీ :

ఉల్లిపాయలు                  :        పావుకిలో 
ఎండుమిరపకాయలు     :        10
కొబ్బరి                          :       చిన్న చిప్ప 
పసుపు                        :         చిటికెడు 
చింతపండు                   :         తగినంత 
బెల్లం                            :        రుచికి తగినంత 
ఉప్పు                           :        ఒక టేబుల్ స్పూన్ 
నూనె                            :        నాలుగు టీ స్పూన్స్ 
కరివేపాకు                      :       2 రెబ్బలు 

తయారీ విదానము :
ఉల్లిపాయలు తప్ప మిగిలినవన్ని మెత్తగా  గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఉల్లిపాయలు వేసి కచ్చా పచ్చా గ 
గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఫై న  చెప్పిన కొలతల ప్రకారం నూనె వేసి అది కొంచెం 
వేడి అయిన తరువాత తాలింపు గిన్జేలు  వేసి అవి లైట్ బ్రౌన్ వచ్చిన తరువాత కరివేపాకు వేయాలి. ఇప్పడు పక్కన గ్రైండ్ చేసి పెట్టుకున్న  ఉల్లిపాయల మిశ్రమాన్ని వేసి ఒక 4-5 నిమిషాల సేపు ఉంచాలి . 
ఇప్పుదు స్టవ్ ఆఫ్ చేసి సెర్వింగ్ బోవేల్ లోకి తీసుకుంటే వేడి వేడి ఉల్లిపాయ చట్నీ రెడీ ....ఇడ్లీ  లలో
 కానీ లేదా దోసలలో చాల బాగుంటుంది .....



లేమన్ టీ

లేమన్ టీ ఎలా తయార్ చేస్తారో చూద్దామ .....................

స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్ళు తీసుకొని అవి బాగా మరిగిన తరువాత అందులో అరచెంచ టీ పోడి వేసి బాగా మరగనిచ్చి ఆ టీ డికాషిన్  వడకట్టి  అందులో 4 చెంచాలు తేనే, కాస్త నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవచ్చు ....

ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చుడండి హెల్త్ కి చాలా మంచిది......

Wednesday, August 29, 2012

దహి ఫ్రూట్ చాట్

ఇప్పుడు ఒక స్నాక్ ఐటెం ఎలాగో చూద్దామా  మరి .................

దహి ఫ్రూట్ చాట్  :

ఆపిల్ ,  పయిన్ఆపిల్, గ్రేప్స్ , సపోటా, బొప్పాయి , అరటిపండు అన్ని చిన్న ముక్కలుగా చేసి ఒక కప్పులోకి తీసుకొవాలి.

ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు అందులో జీలకర్ర ఒక టీ స్పూన్ , నిమ్మరసం ఒక టీ స్పూన్ వేసి బాగా కలపాలి....

ఇప్పడు పక్కన తీసి పెట్టుకున్న ముక్కలని వేసి బాగా కలపాలి. 

ఇప్పుడు సెర్వింగ్ బోవేల్ లోకి తీసుకొని  కొత్తిమీర వేయలి.....

ఒక చక్కని స్నాక్ ఐటెం తినటానికి రెడీ....


 


 


పాలకూర రైతా

పాలకూర రైతాకు  కావలసిన పదార్దాలు: 

పాలకూర ------------- 2 కప్పులు 

ఉల్లిపాయ ----------- చిన్నది 1a
కారం ---------------తగినంత 
 ఉప్పు ------------ తగినంత 
జీలకర్ర ----------- 1 టీ స్పూన్ 
మిరియాల పొడి ---- హాఫ్ టీ స్పూన్ 
పెరుగు-------------------- ఒక కప్పు 

తయారీ విదానము :
పాలకూరని 5 --- 7 నిమిషాలదాకా ఉడకబెట్టండి. తర్వాత వేరే గిన్నెలో మిగతావన్నీ తీసుకొని బాగా కలియబెట్టాలి.
ఇప్పుడు పాలకూరకి ఈ మిశ్రమాన్ని కలిపి బాగా కలిసేలాగా  కలియబెట్టాలి. చల్లారిన తర్వాత అన్నం తో గాని రొట్టెలతో గాని  తింటే రుచిగా వుంటుంది.



 


సేమ్య ఉప్మా

సేమ్య ఉప్మా అంటే చాలా  మంది ఇష్టంగా తింటూ వుంటారు. అందుకే ఈరోజు నేను సేమ్య ఉప్మా ఎలాగో చూద్దామా  మరీ ........

కావలసిన పదార్దాలు:
సేమ్య --------------- 2  కప్పులు 
అనియన్స్ --------- 2 చిన్నవి 
పచ్చిమిర్చి --------- 2 లేదా 4
నూనె -------------  5 టీ స్పూన్స్
తాలింపుగింజేలు   ------- (ఆవాలు, పచ్చిశనగ పప్పు,జీలకర్ర )
జీడిపప్పు --------- ఎవరికీ ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు (5-7)
యాలుకలు (ఇలాఛి)----------- 2
కరివేపాకు  ----------- కొంచెం 
కొత్తిమీర ------------ కొచెం 
వాటర్ ------------ మీరు సేమ్య కి ఉపయోగించిన కప్పుతో వాటర్ తీసుకొండి (3 కప్పులు)
ఉప్పు ------------ రుచికి తగినంత 

తయారీ విదానము:
ముందుగ స్టవ్ వెలిగించి కడాయి స్టవ్ మీద పెట్టి  నూనె వేసి కొంచెం వేడి అయిన తర్వాత తాలింపు గిన్జేలు వేసుకోవాలి . అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అనియన్స్, పచ్చిమిర్చి, జీడిపప్పు , యాలుకలు వేసి అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటర్ పోయాలి ఇప్పడు ఉప్పు వేసి అవి మరిగిన తర్వాత సేమ్య వేసుకోవాలి . సేమ్య బాగా వుడికిన తర్వాత అంటే సేమ్య వేసి బాగా కలియ బెట్టాలి . ఒక 5 నిముషాలు వుంచి వాటర్ మొత్తం ఆవిరి అయిన  తర్వాత కొత్తిమీరా, కరివేపాకు వేయాలి ఒక్కసై అంట బాగా కలియబెట్టాలి.....
 వేడివేడిగా  సేమ్యఉప్మా తినటానికి రెడీ ....


Tuesday, August 28, 2012

సున్నుండలు

సున్నుండలు  తయారీ విదానము ఎలాగో చూద్దామా ?
కావలసిన పదార్దాలు :
గుండు మినపప్పు :  హాఫ్ కేజీ 
నెయ్యి :  ముప్పావ్ కేజీ 
చక్కర లేదా బెల్లం : హాఫ్ కేజీ 

ఇప్పుడు ఎలా చెయ్యాలో  చూద్దామా  మరి :
ముందుగ  స్టవ్ వెలిగించి  గుండు మినపప్పును  ఒక కడాయిలోకి  తీసుకొని లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి .(కొంచెం వేడి తగ్గినా తర్వాత గుండు మినపప్పు ను గ్రయిండ్ చేసుకోవాలి )
పంచదారని గ్రయిండ్  చేసి పక్కన పెట్టుకోవాలి .
ఇప్పుడు  గుండు మినపప్పు పొడి  , పంచదార  పొడి కలిపి నెయ్యి  వేసికొని  బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి .... అంతే తియ్యగా వుండే సున్నుండలు తినడానికి రెడీ .......

మీల్ మేకేర్స్ కర్రీ

మీల్ మేకేర్స్  కర్రీ  తయార్ చేయటం ఎలా?
---------------------------------------------------
కావలసిన పదార్దాలు :
---------------------------
మీల్ మేకేర్స్ : పావుకేజీ 
టమోటాలు : పావుకేజీ 
పచ్చి మిర్చి  : నాలుగు 
ఆనియన్స్  : నాలుగు 
పసుపు : చిటికెడు  
ఉప్పు : రుచికి తగినంత 
కారం : ఒక టీ స్పూన్ 
నూనె  : వంద గ్రాములు 
తాలింపు గింజేలు : రెండు టీ స్పూన్స్ (ఆవాలు , మినపప్పు , జీలకర్ర ,సోంపు )
ఇంగువ : కొంచెం 
కరివేపాకు  , కొత్తిమీర  : కొంచెం 

తయారీ విదానము:
ముందుగా  స్టవ్ వెలిగించి  కడాయి స్టవ్ మీద పెట్టుకొని  నూనె వేసి కొంచెం నూనె వేడి అయిన తర్వాత   ఆవాలు , మినపప్పు , జీలకర్ర ,సోంపు వేసి కొంచెం లైట్  బ్రౌన్  వచ్చేవరకు  వేయించి  తర్వాత పచ్చి మిర్చి,ఆనియన్స్  , టమోటాలు వేసి  లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేగించి 2 గ్లాసుల నీళ్ళు  పోసి అవి మరిగిన తర్వాత మీల్ మేకేర్స్ వేసుకొని అందులో ఉప్పు, కారం, ఇంగువ వేసి 15 నిముషాలు ఉడికించి కర్రీ దగ్గరగ అయ్యేవరకు వుంచి కొత్తిమీర , కరివేపాకువేయాలి.

అంతే వేడి వేడి మీల్ మేకేర్స్ కర్రీ రెడీ .........................

 

టమోటా రైస్

టమోటా రైస్ తయార్  చేయటం ఎలా ?
కావలసిన పదార్దాలు:
రైస్--------------------- హాఫ్ కేజీ
టమోటాలు ---------------- నాలుగు
పచ్చి మిర్చి ---------------నాలుగూ
పసుపు------------------- హాఫ్ టీ స్పూన్
నూనె ------------------- ఫిఫ్టీ గ్రామస్ అంటే రైస్ ఎంత క్వాన్త్య్తి కి తీసుకుంటామో దానికి సరిపడా తీసుకోవాలి...
జీలకర్ర-------------------ఒక టీ స్పూన్
ధనియాల పొడి----------- -ఒక టీ స్పూన్
ఇంగువ ----------------హాఫ్ టీ స్పూన్
అనిఆన్స్, -----------రెండు
ఉప్పు ------------ రుచి కి తగినంత
-----------------------------------------------
టమోటా రైస్ తయారీ విదానము:
ముందుగ రైస్ వండి పక్కన పెట్టుకోవాలి ....
టమోటాలు బాగా శుబ్రం చేసి ముక్కలుగా చేసుకోవాలి. అనిఆన్స్ పచ్చిమిర్చి కూడా ముక్కలుగా వేసు కోవాలి.
తరువాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం వేడి ఎక్కిన్ తరువాత అనిఆన్స్ , పచ్చిమిర్చి ,టమోటాలు, కొంచెం వేగిన తరువాత పసుపు వేసి తరువాత ఉడికించిన రైస్ వేసి బాగా కలపాలి....ఇప్పడు ఉప్పు ,ధనియాల పొడి , జిలకర పొడి , ఇంగువ, కారం వేసి బాగా కలపాలి.

అంతే వేడి వేడి టమోటా రైస్ తినటానికి రెడీ










టమోటా పులావ్

టమోటా పులావ్  చేయటం  ఎలా ?
కావలసిన పదార్దాలు:
రైస్--------------------- హాఫ్ కేజీ
టమోటాలు ---------------- నాలుగు
పచ్చి మిర్చి ---------------నాలుగూ 
అల్లం, వెల్లుల్లి పేస్టు -------3 టీ స్పూన్స్  
దాల్చిన చెక్క, లవంగాలు పొడి ----- కొంచెం 
పసుపు------------------- హాఫ్ టీ స్పూన్
నూనె ------------------- ఫిఫ్టీ గ్రామస్ అంటే రైస్ ఎంత క్వాన్త్య్తి కి తీసుకుంటామో దానికి సరిపడా తీసుకోవాలి...
జీలకర్ర-------------------ఒక టీ స్పూన్
ధనియాల పొడి----------- -ఒక టీ స్పూన్
ఇంగువ ----------------హాఫ్ టీ స్పూన్
అనిఆన్స్, -----------రెండు
ఉప్పు ------------ రుచి కి తగినంత
-----------------------------------------------
టమోటా పులావ్  తయారీ విదానము:
ముందుగ రైస్ వండి పక్కన పెట్టుకోవాలి ....
టమోటాలు బాగా శుభ్రం చేసి ముక్కలుగా చేసుకోవాలి.
అనిఆన్స్ పచ్చిమిర్చి కూడా ముక్కలుగా వేసుకోవాలి.
తరువాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం వేడి ఎక్కిన్ తరువాత అనిఆన్స్ , పచ్చిమిర్చి , అల్లం వెల్లుల్లి పేస్టు మరియు టమోటాలు వేసి  కొంచెం వేగిన తరువాత పసుపు వేసి  ఆ తరువాత ఉడికించిన రైస్ వేసి బాగా కలపాలి....ఇప్పడు ఉప్పు ,ధనియాల పొడి , జిలకర పొడి , ఇంగువ, కారం వేసి బాగా కలపాలి.
అంతే వేడి వేడి టమోటా పులావ్ రెడీ .......