Monday, September 24, 2012

కాప్సికం బటానీ కూర

కావలసినవి 
కాప్సికం           :     పావుకేజీ 
బటాని              :     1 కప్పు 
ఉల్లిపాయలు      :      2
అల్లంవెల్లుల్లిపేస్టు :      1 స్పూన్ 
నూనె                :     1 గరిట 
ఉప్పు               :      తగినంత 
కారం                :      తగినంత 
జీలకర్ర పొడి       :      1 స్పూన్ 
దనియాల పొడి   :      1 స్పూన్ 
వామ్ము             ;      1/2 స్పూన్ 
సోంపు               :       1/2 స్పూన్   
కరివేపాకు           :      కొంచెం 
కొత్తిమీర              :      కొంచెం 

ముందుగ బటానిని ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి  పెట్టుకొని నూనె వేసుకొని కొంచెం నూనె వేడెక్కిన  తరువాత ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి పేస్టు వేగిన తరువాత కాప్సికం వేసుకొని కొంచెం వేగిన తరువాత ఉడికించిన బటాని వేసుకోవాలి.
ఇప్పుడు అందులో  కొంచెం నీళ్ళు పోసి (1 గ్లాస్ )జీలకర్ర పొడి, దనియాల పొడి, సోంపు, వామ్ము ఉప్పు, కారం అన్ని వేసి దగ్గరగా అయ్యేంత వరకు వుంచి కరివేపాకు , కొత్తిమీర వేసి కూరని సెర్వింగ్ బోవేల్ లోకి తీసుకోండి .

Sunday, September 23, 2012

దోసకాయ కూర

దోసకాయ కూర         :      1/2 కిలో 
పచ్చిమిర్చి                :        6
నూనె                        :         25 గ్రాములు 
ఎండుమిర్చి                :        2
వెల్లుల్లి పాయలు          :        4 
ఉల్లిపాయ                    :        1
ఉప్పు, పసుపు, కారం  :        తగినంత 
తాలింపు గిన్జేలు           :        2 స్పూన్లు 
కరివేపాకు, కొత్తిమీరా    :        కొంచెం 
దనియాల పొడి             :       1 స్పూన్ 

తయారి విదానము

దోసకాయ చెక్కు తీసి చేదులేకుండా చూసుకోవాలి.
చిన్ని, చిన్ని ముక్కలుగా తరగాలి.
పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు తరిగి పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవి నూనె పోసుకొని కొంచెం వేడి అయిన తరువాత  ఎందు మిరపకాయలు,తాలింపు గిన్జేలు వేసుకొని  కొంచెం వేగిన తరువాత ఉల్లిపాయలు , పచ్చి మిరపకాయలు దోసకాయ ముక్కలు వెల్లుల్లి , కరివేపాకు వేసుకొని కొంచెం వేగిన తరువాత  కొంచెం నీళ్ళు పోసుకొని పసుపు , కారం, ఉప్పు , దనియాల పొడి
వేసుకొని ఒక 15 నిముషాలు ఉంచిన తరువాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి సెర్వింగ్ బోవేల్ లోకి తీసుకోవాలి.

బియ్యపిండి గారెలు

బియ్యం పిండి  :    4 కప్పులు 
పెరుగు            :     2 కప్పులు 
ఉల్లిపాయలు    :     2
అల్లం              :      కొంచెం 
నూనె             :     డీప్ ఫ్రై  చేయటానికి తగినంత 
కరివేపాకు      :      కొంచెం 
పచ్చిమిర్చి     :      5
ఉప్పు            :     తగినంత    

తయారి విధానము:

బియ్యపిండి బరకగా వుండాలి.  బియ్యపిండిని  ఒక గిన్నెలోకి తీసుకోని అందులో  పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు తగినంత , జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకు అన్ని వేసి బాగా  గారెల  పిండిలా కలుపుకోవాలి.  15 నిమిషాలు పిండిని పక్కన పెట్టి ఆతరువాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె పోసి బాగా నూనె వేడెక్కిన తరువాత కలిపి పెట్టుకున్న పిండిని గారేలుగా వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఉంఛి సెర్వింగ్ బోవేల్ లోకి తీసుకోవాలి.


Saturday, September 15, 2012

మ్యాంగో ఐస్ క్రీం

కావలసినవి:
బంగిన పల్లి మ్యాంగో              :        3
పంచదార                             :        5 స్పూన్స్ 
నిమ్మరసం                           :        1 స్పూన్ 
పాలు                                   :        1 లీటర్ 
ఐస్ క్రీం పౌడర్                       :        2 స్పూన్స్ 

 మామిడి కాయను తొక్క తీసి ముక్కలుగా కోసి మిక్సిలో వేసి నిమ్మరసం,పంచదార  కలిపి బాగా గుజ్జుగా అయ్యే వరకు చేయాలి.
ఇప్పుడు పాలు బాగా మరిగించి రెండు వంతులు మరిగిన తరువాత తయారు చేసి పళ్ళ గుజ్జును కలపాలి. దించేటప్పుడు  ఐస్ క్రీం పౌడర్ను వేసి బాగా కలిపి ఇప్పుడు  ఆ మిశ్రమాన్ని ఒక ట్రే లోకి తీసుకోవాలి. చల్లారిన తరువాత దీప ఫ్రిజ్ లో 2 గంటలు ఉంచాలి .
తరువాత ఐస్ క్రీం  కప్స్  లోకి తీసుకొని కావాలంటే జీడి పప్పు , బాదం తో అలంకరించి సర్వే చేసుకోవచ్చు.
అందరు ఇష్టపడే మ్యాంగో ఐస్ రెడీ.




కోకోనట్ ఖీర్

పాలు                                  :      3 లీటర్లు 
పచ్చి కొబ్బరి  చిప్పలు          :       2
బాదం పప్పు                        :       తగినన్ని 
 జీడి పప్పు                          :        తగినన్ని 
పిస్తా పప్పు                          :         తగినన్ని 
పాలకోవా                             :         150 గ్రాములు 
పంచదార                             :         6 స్పూన్స్ 

తయారి విదానము :


మూడుగా కొబ్బరి తురుముకొని ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో పాలు పోసి  వేడయిన తరువాత కొబ్బరి తురుము వేసుకొని బాగా కలిపి ఉడికించాలి . తరువాత పాలకోవా, పంచదార వేసి సన్నని  సెగఫై  ఉడికించాలి. 

ఇలా 10 - 15 నిమిషాల తరువాత జీడి పప్పు, పిస్తా బాదం అన్ని వేసుకొని బాగా కలపాలి.
ఇది వేడి గ అయిన తినవచ్చు లేదా ఫ్రిజ్ లో వుంచి బాగా చల్లగా అయిన తినవచ్చు.


Friday, September 14, 2012

క్యాబేజీ పచ్చడి


కావలసినవి:
క్యాబేజీ                 :    1/2 కిలో
కారం                    :    100 గ్రా
ఉప్పు                   :    100 గ్రా 
ఆవపిండి               :    2 చెంచాలు 
మెంతి పిండి           :   1 చెంచా 
నిమ్మరసం             :   5

తయారీ విదానము :
క్యాబేజిని తరిగి బాగా కడిగి ఆరబెట్టుకోవాలి.
తడి అంతా ఆరిపోయాక  క్యాబేజీ ముక్కలన్నీ ఒక జాడీలోకి పోసి ఉప్పు కలుపుకోవాలి.
మూడు రోజుల తరువాత తీసి ఒక బేసిన్ లో పోసి కారం, నిమ్మకాయ రసం కలపాలి.
దానికి ఆవపిండి, మెంతిపిండి కూడా కలపాలి. ఇప్పుడు  నూనెను పోసి జాదిలోకి పెట్టుకోవాలి.
అవసరమయినప్పుడు పచ్చడిని పోపు పెట్టుకొని తినవచ్చు.



అరటిపండ్ల జామ్

కావాలసినవి :
బాగా మగ్గిన అరటిపండ్లు   :   1 కప్పు 
సిట్రిక్ ఆసిడ్                     :    1/4 స్పూన్ 
పంచదార                         :     3/4 కప్పు 
 
బాగా మగ్గిన అరటిపండ్లును గుజ్జుగా చేసి 1 కప్పు  ఒక గిన్నెలోకి తీసికోవాలి. అందులో సిట్రిక్ ఆసిడ్ , పంచదార  కలిపి కొంచెం నీళ్ళు పోసి సన్నని సెగ ఫై  ఉడికించాలి .  అంతా దగ్గరగా వచ్చేవరకు ఉంచి తరువాత దించేసి ఒక పొడి సీసాలో భద్ర పరుచుకోవాలి.