Tuesday, July 26, 2011

పనీర్ పలావ్ తయార్ చేయటం ఎలాగో చుడండి ?

కావలసిన పదార్దాలు:
పనీర్: మూడు వందల గ్రాములు.
రైస్:పావుకేజీ
నూనె: మూడు వందల గ్రాములు అంటే రెండు కప్పుల నూనె తీసుకోవచ్చు.
ఆనియన్స్:అయిదు
పచ్చిమిర్చి:అయిదు
అల్లం, వెల్లుల్లి పేస్టు:రెండు టీ స్పూన్స్.
ఉప్పు:రుచికి తగినంత.
పెరుగు:ఒక కప్పు.
దనియాల పౌడర్:రెండు టీ స్పూన్స్.
జీర పౌడర్:రెండు టీ స్పూన్స్
కొత్తిమీర:కొంచెం
పుదినా:కొంచెం
కరివేపాకు: మూడు రెమ్మలు

ముందుగా రైస్ వండి పక్కన పెట్టుకోవాలి . ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి .
ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి కొంచెం వేడెక్కిన తరువాత ఆనియన్స్, పచ్చిమిర్చి తరువార పనీర్ ,అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కొంచెం వేగిన తరువాత పెరుగు వేయాలి తరువార కొత్తిమీర, కరివేపాకు, పుదినా వేసి బాగా కలపాలి .

ఇప్పుడు ఉడికించిన రైస్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఉప్పు, దనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసి బాగా కలిపి వేరే బవెల్ లోకి తీసుకొని ఆనియన్స్ తోటి గార్నిష్ చేసుకుంటే ఏంటో రుచి కరమయిన పనీర్ పలావ్ రెడీ.

కొబ్బరి రైస్ తయార్ చేయటం ఎలాగో చుడండి?

కావలసిన పదార్దాలు:
పచ్చి కొబ్బరి: ఒక చిన్నన కప్పు (అంటే ఒక ఒక కొబ్బరి కాయ)
రైస్: పావుకేజీ
ఆయిల్ : చిన్న కప్పుపసుపు: చిటికెడు
గుండు మినపప్పు : ఒక టీ స్పూన్జీల కర్ర : ఒక టీ స్పూన్
ఎండు మిరపకాయలు: నాలుగూ.
ఉప్పు: రుచికి తగిననత.
ఆనియన్స్: మూడు
కరివేరాకు: రెండు రెమ్మలు.
కొత్తిమీర :గార్నిష్ కి

ముందుగా రైస్ వండి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరిని తురుం చేసి పక్కన పెట్టుకోవాలి .

తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండు మిరపకాయలు, మినపప్పు, జీలకర్ర వేసి కొంచెం వేగిన తరువాత ఆనియన్స్ వేసి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేవరకు వేయించిన తరువాత పసుపు తరువాత కొబ్బరి తురుము వేయాలి కొంచెం వేగిన తరువాత ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ , ఉప్పును ని వేసి బాగా కలియ బెట్టాలి.
చివరగా కరివేపాకు వేసి బాగా కలపాలి.

ఇప్పుడు వేరే బోవేల్ లోకి తీసుకొని కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే ఏంటో రుచి కరమయిన కొబ్బరి రైస్ తయార్.

Monday, July 25, 2011

పాలక్ పనీర్ తయార్ చేయటం ఎలాగో చుడండి?

కావలసిన పదార్దాలు:
పాలక్ : అయిదు కట్టలు
పనీర్: రెండు వందల గ్రాములు
నూనె: వంద గ్రాములు అంటే ఒక చిన్న కప్పు.
ఆనియన్స్: ఐదు.
పచ్చిమిర్చి: ఐదు.
పసుపు: చిటెకెడు
ఉప్పు:రుచికి తగినంత.
జీడిపప్పు: పది గ్రాములు అంటే ఎవరికీ ఎన్నికావలో రుచికి సరిపడా వేసుకోవచ్చు .
దనియాల పొడి:టీ స్పూన్
జీలకర్ర పొడి:టీ స్పూన్
కొత్తిమీర:
కరివేపాకు:

ముందుగ పాలక్ ని శుబ్రం గ కడిగి ఒక గిన్నెలో కి తీసుకొని అందులో ఒక గ్లాస్ మంచి వాటర్ పోసి ఉడక బెట్టాలి.


ఇప్పుడు పాలక కొంచెం చల్లారిన తరువాత గ్రయిండ్ చేసుకోవాలి. పేస్టు చేసుకున్న పాలక్ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.


ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి కొంచెం వేడెక్కిన తరువాత ఆనియన్స్ , పచ్చిమిర్చి వేసి కొంచెం వేగిన తరువాత , పనీర్ , జీడిపప్పు వేయాలి తరువాత పాలక్ మిశ్రమాన్ని వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి పదిహేను నిముషాలు ఉడికించాలి. తరువాత రుచికి సరిపడా ఉప్పు, దనియాల పొడి, జీలకర పొడి వేసి ఒక అయిదు నిముషాలు ఉడికించి ఒక బవెల్ లో కి తీసుకొని కొత్తిమీర కరివేపాకు తో గార్నిష్ చేసుకోవాలి.


వేడి వేడి పాలక్ పనీర్ తినటానికి రెడీ .

Sunday, July 24, 2011

జీరా రైస్ తయారీ చేయటం ఎలాగో చుడండి ?

కావలసిన పదార్దాలు:
రైస్ --------------------- పావు కేజీ
జీరా -------------------- వంద గ్రాములు
నూనె ------------------- వంద గ్రాములు
ఉప్పు ------------------ రుచికి తగినంత
ఆనియన్స్ --------------రెండు
పచ్చిమిర్చి -------------అయిదు
పసుపు----------------చిటికెడుకొత్తిమీర
పుదినా
కరివేపాకు

జీరా రైస్ తయారీ విదానము:
ముందుగా రైస్ వండుకోవాలి తరువాత ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి
ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి అంటే రైస్ కు తగినంత తీసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు, పచ్చి శనగ పప్పు టీ స్పూన్ వేసుకోవాలి . కొంచెం వేగిన తరువాత పచ్చిమిర్చి, ఆనియన్స్ , కొంచెం కొత్తిమీర, పుదినా, కరివేపాకు వేసి కొంచెం వేగిన తరువాత ఇప్పుడు జీరా వేసి బాగా కలియ బెట్టాలి. ఇప్పుడు వండిన రైస్ నూ తగినంత ఉప్పు వేసి వేసి బాగా కలియ బెట్టాలి.

ఇప్పుడు ఒక బవెల్ లోకి తీసుకొని కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకోవాలి .

అంతే వేడి వేడి జీరా రైస్ తయార్








Thursday, July 21, 2011

గోంగూర రైస్ చేయటం ఎలా ?

కావలసిన పదార్దాలు:

రైస్--------------------- హాఫ్ కేజీ
గోంగూర---------------- గోంగూర చిన్న కట్టలు రెండు అంటే రైస్ క్వాన్త్య్తి కి హాఫ్ గోంగూర గ్రైండ్ చేసిన పేస్టు తెసుకోవాలి ....
పచ్చి మిర్చి -------------నాలుగు
పసుపు------------------- హాఫ్ టీ స్పూన్
నూనె ------------------- ఫిఫ్టీ గ్రామస్ అంటే రైస్ ఎంత క్వాన్త్య్తి కి తీసుకుంటామో దానికి సరిపడా తీసుకోవాలి...
జీలకర్ర-------------------ఒక టీ స్పూన్
ధనియాల పొడి----------- -ఒక టీ స్పూన్
ఇంగువ ----------------హాఫ్ టీ స్పూన్
ఆనియన్ -------------- ఒకటి
ఉప్పు -------------- రుచి కి తగినంత

-----------------------------------------------

గోంగూర
రైస్ తయారీ విదానము:

ముందుగ రైస్ వండి పక్కన పెట్టుకోవాలి . తరువాత గోంగూర బాగా శుబ్రం చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. కూడా తరు వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం వేడి ఎక్కిన్ తరువాత అనిఒన్స వేసి కొంచెం వేగిన తరువాత పసుపు వేసి తరువాత గోంగూర పేస్టు వేసి బాగా కలపాలి. తరువాత ఉడికించిన రైస్ వేసి బాగా కలపాలి....ఇప్పడు ఉప్పు , ధనియాల పొడి , జిలకర పొడి , ఇంగువ, కారం వేసి బాగా కలపాలి.

అంతే వేడి వేడి గోంగూర రైస్ తినటానికి రెడీ.










Wednesday, July 20, 2011

జీడి పప్పు పకోడీ తయారీచేయటం ఎలా?

కావలసిన పదార్దాలు:
జీడి పప్పు ----- 100 గ్రామస్,
మైదా పిండి ----- పావుకేజి,
నూనె ----- అరకేజీ,
ఉల్లిపాయలు ---- అయిదు,
పచ్చిమిరపకాయలు---- మూడు,
కొత్తిమీర ------ ఒక చిన్న కట్ట,
కరివేపాకు ------ కొంచెం,
ఉప్పు ------ రుచికి సరిపడినంత,
సోడా ఉప్పు ----- చిటికెడు,
------------------------------------------

జీడి పప్పు పకోడీ తయారి విదానము :
ముందుగా మైదా పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో జీడి పప్పు , ఉప్పు , సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, చిటికెడు సోడా ఉప్పు అన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో పెరుగు వేసుకొని కలుపుకోవాలి కొంచెం నీళ్ళు పోసుకొని కొమేచం జారుగా కలుపుకోవాలి.
ఇప్పుడు పొయ్యి మీద కాడాయి పెట్టుకొని అందులో నూనె పోసుకొని నూనె కాగిన తరువాత కలిపి పెట్టుకున్న పిండిని పకోడిలుగా వేసుకోవాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి తరువాత ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి.
అంతే వేడి వేడిగ రుచి కరమయిన జీడి పప్పు పకోడీ తయార్.....