Wednesday, August 29, 2012

సేమ్య ఉప్మా

సేమ్య ఉప్మా అంటే చాలా  మంది ఇష్టంగా తింటూ వుంటారు. అందుకే ఈరోజు నేను సేమ్య ఉప్మా ఎలాగో చూద్దామా  మరీ ........

కావలసిన పదార్దాలు:
సేమ్య --------------- 2  కప్పులు 
అనియన్స్ --------- 2 చిన్నవి 
పచ్చిమిర్చి --------- 2 లేదా 4
నూనె -------------  5 టీ స్పూన్స్
తాలింపుగింజేలు   ------- (ఆవాలు, పచ్చిశనగ పప్పు,జీలకర్ర )
జీడిపప్పు --------- ఎవరికీ ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు (5-7)
యాలుకలు (ఇలాఛి)----------- 2
కరివేపాకు  ----------- కొంచెం 
కొత్తిమీర ------------ కొచెం 
వాటర్ ------------ మీరు సేమ్య కి ఉపయోగించిన కప్పుతో వాటర్ తీసుకొండి (3 కప్పులు)
ఉప్పు ------------ రుచికి తగినంత 

తయారీ విదానము:
ముందుగ స్టవ్ వెలిగించి కడాయి స్టవ్ మీద పెట్టి  నూనె వేసి కొంచెం వేడి అయిన తర్వాత తాలింపు గిన్జేలు వేసుకోవాలి . అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అనియన్స్, పచ్చిమిర్చి, జీడిపప్పు , యాలుకలు వేసి అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటర్ పోయాలి ఇప్పడు ఉప్పు వేసి అవి మరిగిన తర్వాత సేమ్య వేసుకోవాలి . సేమ్య బాగా వుడికిన తర్వాత అంటే సేమ్య వేసి బాగా కలియ బెట్టాలి . ఒక 5 నిముషాలు వుంచి వాటర్ మొత్తం ఆవిరి అయిన  తర్వాత కొత్తిమీరా, కరివేపాకు వేయాలి ఒక్కసై అంట బాగా కలియబెట్టాలి.....
 వేడివేడిగా  సేమ్యఉప్మా తినటానికి రెడీ ....


No comments:

Post a Comment