Tuesday, August 28, 2012

మీల్ మేకేర్స్ కర్రీ

మీల్ మేకేర్స్  కర్రీ  తయార్ చేయటం ఎలా?
---------------------------------------------------
కావలసిన పదార్దాలు :
---------------------------
మీల్ మేకేర్స్ : పావుకేజీ 
టమోటాలు : పావుకేజీ 
పచ్చి మిర్చి  : నాలుగు 
ఆనియన్స్  : నాలుగు 
పసుపు : చిటికెడు  
ఉప్పు : రుచికి తగినంత 
కారం : ఒక టీ స్పూన్ 
నూనె  : వంద గ్రాములు 
తాలింపు గింజేలు : రెండు టీ స్పూన్స్ (ఆవాలు , మినపప్పు , జీలకర్ర ,సోంపు )
ఇంగువ : కొంచెం 
కరివేపాకు  , కొత్తిమీర  : కొంచెం 

తయారీ విదానము:
ముందుగా  స్టవ్ వెలిగించి  కడాయి స్టవ్ మీద పెట్టుకొని  నూనె వేసి కొంచెం నూనె వేడి అయిన తర్వాత   ఆవాలు , మినపప్పు , జీలకర్ర ,సోంపు వేసి కొంచెం లైట్  బ్రౌన్  వచ్చేవరకు  వేయించి  తర్వాత పచ్చి మిర్చి,ఆనియన్స్  , టమోటాలు వేసి  లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేగించి 2 గ్లాసుల నీళ్ళు  పోసి అవి మరిగిన తర్వాత మీల్ మేకేర్స్ వేసుకొని అందులో ఉప్పు, కారం, ఇంగువ వేసి 15 నిముషాలు ఉడికించి కర్రీ దగ్గరగ అయ్యేవరకు వుంచి కొత్తిమీర , కరివేపాకువేయాలి.

అంతే వేడి వేడి మీల్ మేకేర్స్ కర్రీ రెడీ .........................

 

No comments:

Post a Comment