Thursday, August 30, 2012

బెండకాయ కొబ్బరి కూర

బెండకాయ కొబ్బరి కూరకు కావలసినవి:
బెండకాయలు         :       పావుకిలో 
పచ్చికొబ్బరి పొడి     :      1 కప్పు 
ఉల్లిపాయలు           :       2 చిన్నవి 
కరివేపాకు               :       2 రెబ్బలు 
కొత్తిమీర                  :        కొంచెం 
 ఉప్పు , కారం          :       తగినంత 
పసుపు                   :       చిటికెడు 
తాలింపు గింజలు     :       3 స్పూన్స్ (ఆవాలు, పచ్చిశనగ పప్పు, జీలకర్ర)
 ఎండు  మిర్చి           :      3
 నూనె                      :      50 గ్రాములు 

తయారీ విదానము :  (బెండకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే పచ్చి కొబ్బరిని ముక్కలుగా చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ).
ముందుగ స్టవ్ వెలిగించి  దానిమీద కడాయి పెట్టుకొని నూనె పోసి కొంచెం వేడి అయిన తరువాత తాలింపు గింజలు 
వేసి అవి బ్రౌన్ కలర్ వచ్చిన తరువాత ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చిన తరువాత బెండకాయలు, పచ్చి కొబ్బరిని వేసి 15 నిమిషాలు వేయించిన తరువాత అందులో ఉప్పు , కారం వేసి బాగా కలపాలి ఇప్పుడు కొత్తిమీర వేసి సెర్వింగ్ బోవేల్ లోకి తీసుకోవాలి.


 

No comments:

Post a Comment