Friday, August 31, 2012

బియ్యప్పిండి హల్వా

బియ్యప్పిండి  హల్వా కి కావలసినవి :

బియ్యప్పిండి              :       పావుకేజీ
పంచదార లేక బెల్లం    :        పావుకేజీ
డాల్డా లేక నెయ్యి        :        పావుకేజీ
జీడి పప్పు                 :         పావుకప్పు

తయారీ విదానము :
ముందుగ  బియ్యం నానబెట్టి మెత్తగా రుబ్బి పాలు తీయాలి .
పాలల్లో పంచదార కలిపి సన్నని సెగ ఫై   పెట్టి కలుపుతూ వుండాలి.
పాలు కొంచెం గట్టిపడగానే, డాల్డా కానీ నెయ్యి కానీ పోసి బాగా కలపాలి మిశ్రమం  బాగా గట్టిపడిన తరువాత  యాలుకల పొడి వేసి మరో సరి బాగా కలిపి ఒక పెద్ద ప్లేట్ లో నెయ్యి రాసి అందులో తయారు చేసి పెట్టుకున్న మిశ్ర మాన్ని అందులో వేయాలి.
నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పును హల్వా ఫై న  అలంకరించుకొని 10 నుంచి 15 నిముషాలు సేపు చల్లారిన తరువాత హల్వా ని మీకు ఇష్ట మైన షేప్స్ లో కట్ చేసుకోవచ్చు.....
  




No comments:

Post a Comment