Friday, August 31, 2012

మామిడి ముక్కల పచ్చడి

మామిడి ముక్కల పచ్చడి కి కావలసినవి:

మామిడి ముక్కలు      :         4 డబ్బాలు 
ఉప్పు                         :         1 డబ్బా 
కారం                          :         1 డబ్బా 
ఆవపిండి                     :         1/4 డబ్బా 
వేరుశనగ నూనె           :           తగినంత  ( అంటే ముక్కలు బాగా మునిగేల నూనె పోసుకుంటే పచ్చడి బాగా రుచిగా ఇంకా నిల్వ కూడా వుంటుంది )

ముందుగ మామిడి కాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక గిన్నెలోకి  తీసుకోవాలి . ఆ ముక్కలలో ఉప్పు, కారం , ఆవ పిండి , మెంతి పిండి  అన్ని ఫైన చెప్పిన ప్రకారం వేసి బాగా  కలపాలి . చివరగా నూనెను వేడి చేసి చల్లార్చి మామిడి ముక్కలలో పోసి బాగా కలపాలి......
రెండో రోజు పచ్చడి ఊరి బాగా రుచిగ వుంటుంది .
 ఈ పచ్చడి నిల్వ వుంటుంది ......





No comments:

Post a Comment