Friday, September 7, 2012

రవ్వదోసె

కావలసినవి :
ఉప్మా రవ్వ  (బొంబాయి రవ్వ)       :       2 1/2 కప్పులు 
మైదా పిండి                                 :      1 కప్పు 
బియ్యప్పిండి                               :       1 1/2 కప్పు 
అల్లం                                          :        కొంచెం 
పచ్చి మిర్చి                                 :        4
జీలకర్ర                                        :        2 టీ స్పూన్స్ 
ఉప్పు                                         :         తగినంత 
 పెరుగు                                       :         హాఫ్ కప్పు 

తయారీ విదానము:

ఉప్మారవ్వ, మైదా పిండి, బియ్యప్పిండి  అన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో అల్లం పచ్చిమిర్చి ముక్కలు  సన్నగా తరిగినవి , తగినంత ఉప్పు  అందులో వేసి ఇప్పడు వాటికి పెరుగు వేసి ( పెరుగు కావాలంటే కలపుకోవచ్చు లేదంటే అవసరం లేదు) ఇప్పుడు నీటిని పోసి బాగా జారుగా కలుపుకోవాలి. అంటే దోసె పిండి లాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఓక్ 15 నిమిషాలు నానబెట్టిన తరువాత  స్టవ్ వెలిగించి దోసె ల పెన్నం పెట్టుకొని కొంచెం పెన్నం వేడెక్కిన తరువాత నూనె వేసి పలుచగా దోసెలు వేసుకోవాలి.
బంగారు రంగు వచ్చిన్దనుకున్నాక  దోసె ను రెండో వైపు  కూడా కాలనిచ్చి దోసెను తీసి సెర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి.
అంతే గుమ గుమ లాడే రావ్వదోసెలు రెడీ.


 

No comments:

Post a Comment