Thursday, September 6, 2012

వెన్న ఉండలు

వెన్న ఉండలు రెండు రకాలుగా చేసుకోవచ్చు . ముదురు పాకం మరియు గులాబ్జాం పాకం 

కావలసినవి:

వెన్న                                     : పావుకేజీ 
మైదా                                     : పావుకేజీ 
నూనె                                     : తగినంత 
యాలుకలు                             : 5
పంచదార కానీ లేక బెల్లం          :  అరకేజీ 
(అవసరమైతే పాలు కొంచెం కలుపుకోవచ్చు  పిండి కలిపేటప్పుడు )

ముందుగ  మైదా పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో వెన్న వేసి బాగా కలిపి ముద్దగా గులాబ్జాం  పిండి లాగ  ముద్ద గా చేసుకోని పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తరువాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి ఇప్పుడు స్టవ్

వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె ఫ్రయి చేయటానికి సరిపోయేంత పోసుకొని బాగా కాగిన తరువాత చేసి పెట్టుకున్న ఉండలను నూనె లో వేసి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేపుకొని వాటిని  తాయారు చేసి పెట్టుకున్న పాకం లో వేసుకోవాలి. ఇప్పుడు యాలుకలు వేసి బాగా కలియబెట్టాలి .
అదే ముదురు పాకం అయితే వుండలన్ని వేసి బాగా కలియబెట్టాలి . పాకం వుండలకి పట్టేల కలియబెట్టాలి 
ఇప్పడు స్టవ్ వెలిగించి పంచదార ఒక గిన్నెలోకి తీసుకొని అందులో  2 టీ గ్లాసులు నీరు పోసుకొని  గులాబ్ జం పాకం లాగ చేసుకోవచ్చు లేదా ముదురు పాకం అరిసెల పాకం లాగ చేసుకోవచ్చు.







No comments:

Post a Comment